కెనడాలో భారతీయ విద్యార్థి దాడి.. బండి కోసమే ఇదంతా!
విదేశాల్లో ఉన్నత విద్య గురించి చదువుకోటానికి వెళ్లి అక్కడే ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కెనడాకు పీజీ కోసం వెళ్లిన 24 ఏళ్ల గుర్‌విందర్ నాథ్ పిజా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. డెలివరీ సమయంలో కొంత మంది దాడి చేయటంతో మృత్యు వాత పడ్డాడు.
విదేశాల్లో చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదించాలని ఆశ పడి వెళ్తున్న భారత విద్యార్థులకు కొన్ని సార్లు చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇండియన్ అనగానే కొందరు దాడులు చేస్తూ ఉంటే మరి కొందరు ఏకంగా హత్యలు చేస్తూ లూటీలు చేస్తున్నారు. ఇండియాకు చెందిన మరో విద్యార్థి కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడి మృతి చెందాడు.
పిజ్జా డెలివరీ చేసే పార్ట్ టైమ్ జాబ్ ను చేస్తున్న గుర్‌విందర్ నాథ్ ను దుండగులు తీవ్రంగా కొట్టడంతో చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందాడు. ఈ సంఘటన అక్కడ మరియు గుర్‌విందర్ సొంత ప్రాంతంలో కూడా తీవ్ర విషాదంను మిగిల్చింది.
సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెనడా లోని ఒంటారియో ప్రావిన్స్ లో పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న 24 ఏళ్ల గుర్‌విందర్ నాథ్ పార్ట్ టైమ్ గా పిజ్జా డెలివరీ బాయ్ గా జాబ్ చేస్తున్నాడు. ఆయన ఇటీవల ఒక ప్రాంతం నుండి పిజ్జా ఆర్డర్ ను అందుకున్నాడు. వెంటనే తన బండి పై పిజ్జా ను డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు.
అక్కడ అప్పటికే డెలివరీ చేసిన వారు రెడీగా ఉండి గుర్‌విందర్ పై దాడి చేసి బండి తీసుకుని అక్కడ నుండి పారిపోయారు. గుర్‌విందర్ కి గాయాలు తీవ్రంగా అవ్వడంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందాడు. గుర్‌విందర్ శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతినడంతో కోలుకోవడం ఆలస్యం అవుతుందని మొదట వైధ్యులు అన్నారు. కాని చివరకు గుర్‌విందర్ గాయాలతో మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు.
Also Read: Telangana Weather Updates: తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ సంఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ సిద్దార్థ్ నాథ్ స్పందించారు. ఆయన స్థానిక పోలీసులతో మాట్లాడుతున్నామని.. ఆయనకు ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన ఎంక్వౌరీ చేస్తున్న పోలీసు అధికారి ఫిల్ కింగ్ మాట్లాడుతూ.. గుర్‌విందర్ వాహనంను దొంగిలించే ఉద్దేశ్యంతో దుండగులు పిజ్జా ఆర్డర్ చేయడం జరిగింది. ఆ పిజ్జా ను తీసుకు వచ్చిన గుర్ విందర్ పై దాడి చేసి వెంటనే వాహనంను తీసుకుని అక్కడ నుండి వెళ్లారు.
సంఘటన జరిగిన ప్రాంతానికి అయిదు కిలోమీటర్ల దూరంలో గుర్ విందర్ బైక్ ను దుండగులు వదిలేసి వెళ్లి పోయారు. గుర్తు తెలియని ఆ వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఈనెల 27న గుర్ విందర్ నాథ్ మృతదేహాన్ని ఇండియాకు పంపించబోతున్నట్లుగా స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పెరిగిన వడ్డీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి